: విశాఖలో గిరిజనుల ఆందోళన


రాష్ట్ర మంత్రి బాలరాజును యలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు దూషించినందుకు నిరసనగా మరోసారి గిరిజనులు ఆందోళన బాట పట్టారు. వందలాదిగా గిరిజనులు ప్లకార్డులు, బ్యానర్లు చేబూని విశాఖ నగరంలోని డీఆర్సీ మీటింగ్ హాల్ వద్దకు చేరుకున్నారు. ఎమ్మెల్యే కన్నబాబును అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. అడ్డగించబోయిన పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

తన కుమారుడు డీసీసీబీ చైర్మన్ కాకుండా అడ్డుకునేందుకు మంత్రి బాలరాజు ప్రతిపక్షాలతో కుమ్మక్కయ్యారని గత నెలలో కన్నబాబు ఆరోపించారు. మరికొన్ని తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో కన్నబాబుపై గిరిజన సంఘాలు మండిపడ్డాయి. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాటిసీ కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ అప్పటి నుంచీ పలు ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. ఆ ఆగ్రహం ఇంకా చల్లారకపోవడం గమనార్హం. 

  • Loading...

More Telugu News