: సీఎం కిరణ్ ను కలవనున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు
సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని వైఎస్సార్సీపీ శాసనసభ్యులు ఈ మధ్యాహ్నం కలవనున్నారు. రాష్ట్ర విభజన తీర్మానంపై అసెంబ్లీని వెంటనే సమావేశ పరచాలని భేటీ సందర్భంగా ఆయనను కోరనున్నారు. ఇదే డిమాండుతో నిన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్ గవర్నర్ నరసింహన్ ను కలిసిన సంగతి తెలిసిందే.