: జగన్ పార్టీలో చేరిన విశ్వరూప్
మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ వైఎస్సార్సీపీలో చేరారు. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ సమక్షంలో ఆయన నేడు పార్టీ సభ్యత్వం స్వీకరించారు. విశ్వరూప్ కు జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశ్వరూప్ మంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. సమైక్యాంధ్ర ఉద్యమంలో చిత్తశుద్ధితో దూసుకుపోతున్న వైఎస్సార్సీపీలో సుశిక్షితుడైన సైనికుడిలా సమైక్య రాష్ట్రం కోసం పోరాడతానని విశ్వరూప్ తెలిపారు.