: హెలికాప్టర్ స్కాం దర్యాప్తులో పురోగతి


సంచలనం సృష్టించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ల కొనుగోలు కుంభకోణంలో దర్యాప్తు అధికారులు పురోగతి సాధించారు. రూ.3600 కోట్ల విలువైన చాపర్ల కొనుగోలు ఒప్పందానికి మధ్యవర్తిగా వ్యవహరించిన స్విస్ జాతీయుడు గిడో రాల్ఫ్ హాష్కేను ఇటలీ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. హాష్కేను స్విట్జర్లాండ్ లో అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. స్విస్ ఫెడరల్ కోర్టులో లాంఛనాలు పూర్తి చేసి అతడిని ఇటలీ తరలించనున్నారు. హాష్కేను విచారిస్తే మరింత కీలక సమాచారం లభ్యమయ్యే అవకాశముందని దర్యాప్తు అధికారులంటున్నారు. కాగా, ఈ కుంభకోణంపై ఇటలీ దర్యాప్తు సంస్థ, సీబీఐ సంయుక్తంగా దర్యాప్తు చేపట్టిన సంగతి తెలిసిందే. భారత వాయుసేన మాజీ చీఫ్ త్యాగి ఈ స్కాంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News