: కోల్ స్కాంలో ఒడిశా సీఎంను ప్రశ్నించాలనుకుంటున్న సీబీఐ
సంచలనం రేపిన బొగ్గు కుంభకోణం కేసులో ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) ప్రశ్నించాలనుకుంటున్నట్లు సమాచారం. ఈ మేరకు ఈ కేసులో నవీన్ పేరును చేర్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కోల్ స్కాం వివాదానికి మూలకారణమైన హిందాల్కోకు 'తాలాబిరా-2' బొగ్గు గనులు కేటాయించాలంటూ ఒడిశా సీఎం కూడా కేంద్ర ప్రభుత్వానికి లిఖిత పూర్వకంగా సిఫార్సు చేశారని సీబీఐ వర్గాలు అంటున్నాయి. అయితే, హిందాల్కో దరఖాస్తును తిరస్కరించి, ప్రభుత్వ రంగ సంస్థలకు (పీఎస్ యూ) గనులు ఇవ్వాలన్న అప్పటి బొగ్గు శాఖ కార్యదర్శి పీసీ పరేఖ్ ను కూడా నవీన్ తప్పుబట్టారని పేర్కొంది. ఈ క్రమంలో స్కాంలో నవీన్ పాత్రపై సీబీఐ ఆరా తీయాలని ప్రయత్నిస్తోంది.