: మధ్యప్రదేశ్‌లో తరిమికొడితే ఇక్కడికొచ్చి పెత్తనం చేస్తున్నాడు: బాబు


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ పై చంద్రబాబు ఘాటైన విమర్శలు చేశారు. మధ్యప్రదేశ్‌లో ప్రజలు తరిమికొడితే దిగ్విజయ్ సింగ్ ఇక్కడికొచ్చి పెత్తనం చెలాయిస్తున్నారని ట్విట్టర్ లో విమర్శించారు. పునరావాసం కోసం ఆయన ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకున్నారని దుయ్యబట్టారు. ఇదిలా ఉంచితే, హైదరాబాద్ లో 3 గంటలు, పట్టణాల్లో 6 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 12 గంటలు విద్యుత్ కోతలున్నా... విద్యుత్ శాఖకు మాత్రం మంత్రే లేరని విమర్శించారు. ప్రభుత్వ అవినీతి, అసమర్థతకు ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారని బాబు ట్విట్టర్ లో ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News