: మీరు పోగొట్టుకున్న సెల్ ఫోన్ చైనాలో!


మీ ఖరీదైన సెల్ ఫోన్ ఎవరో కొట్టేశారు. కంప్లయింట్ ఇచ్చి పోలీసులు చుట్టూ తిరుగుతున్నారు. నెలలు గడిచినా పోలీసుల వల్ల కావడం లేదు. ఇంతకీ మీ సెల్ ఫోన్ ఎటెళ్లిందనుకుంటున్నారా..? అది మీ దగ్గర మాయమై చైనాలో తేలింది. కొట్టేసిన ఖరీదైన ఫోన్లను ఇప్పుడు చోరులు చైనాకు తరలిస్తున్నారని హైదరాబాద్ నగర పోలీసులు అంటున్నారు. గతంలో కొట్టేసిన ఫోన్లకు ఐఎంఈఐ నంబర్ ను ట్యాంపరింగ్ ద్వారా మార్చేసి ఇక్కడే విక్రయించేవారు. అయితే, ఇప్పుడు మాత్రం ఖరీదైన ఫోన్లను సులభంగా చైనాకు తరలించేస్తున్నారు. చైనా ద్వారా సరుకులు తెప్పించుకునే వర్తకులే ఫోన్లను అక్కడికి తరలించేందుకు తోడ్పడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News