: ఫేస్ బుక్ లో మహిళకు కోటి రూపాయలకు టోపీ


తెలియని వాడిని గుడ్డిగా నమ్మి నిండా మునగడం కొందరికి బాగా అలవాటు. ఈ రకానికే చెందిన దేవిక ఫేస్ బుక్ లో ఓ కేటుగాడిని నమ్మి మునిగిపోయింది. గుజరాత్ కు చెందిన దేవికకు ఫేస్ బుక్ లో రఘువీర్ సింగ్ అనే వ్యక్తి ఇన్సూరెన్స్ ఏజెంట్ గా పరిచయమయ్యాడు. తక్కువ కాలంలో స్వల్ప పెట్టుబడులకు బోలెడంత లాభాలిచ్చే పథకాలున్నాయంటూ 1.10 కోట్ల రూపాయలు రాబట్టి కనిపించకుండాపోయాడు. దేవిక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు ఉత్తరప్రదేశ్ లోని ఘజియాబాద్ లో మోసగాడు రఘువీర్ సింగ్ ను అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News