: నేటినుంచే కాంగ్రెస్ జైత్రయాత్ర సభలు
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన చేసిన కాంగ్రెస్ అధిష్ఠానానికి కృతజ్ఞతలు చెప్పే నిమిత్తం టీ కాంగ్రెస్ నేతలు తలపెట్టిన 'జైత్రయాత్ర సభలు' నేటినుంచి ప్రారంభమవుతున్నాయి. అందులో భాగంగా మొదటి సభ నిజామాబాద్ జిల్లా బోధన్ లో జరగనుంది. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్సేననే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడమే ఈ సభల ముఖ్య ఉద్దేశం. రెండో సమావేశాన్ని 21వ తేదీన ఖమ్మం జిల్లాలో జరపాల్సి ఉన్నా కొన్ని కారణాల వల్ల దానిని వాయిదా వేశారు. కాబట్టి, జైత్రయాత్ర ముగింపు సభను ఆ జిల్లాలో భారీ ఎత్తున నిర్వహించాలని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.