: నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ముఠా అరెస్టు


నకిలీ కరెన్సీ నోట్లను చలామణి చేస్తున్న ఆరుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.50 లక్షల విలువైన నకిలీ నోట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో జరిగింది. ఈ మధ్య కాలంలో పాలకొల్లు ప్రాంతంలో నకిలీ నోట్ల చలామణి జోరందుకుంది. దీంతో, దీని వెనకున్న సూత్రధారులను, పాత్రధారులను పట్టుకోవడానికి పోలీసులు నిఘా పెట్టారు. అరెస్టయిన వారిలో ఒక వ్యాపారి కూడా ఉన్నాడు. అరెస్టయిన వారందరూ పాత నేరస్తులేనని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News