: షిండేపై పిటిషన్ ను విచారిస్తాం: ముంబై హైకోర్టు


మహారాష్ట్రను కుదిపేసిన ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ కుంభకోణం కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ షిండేను వెంటాడుతోంది. షిండేను నిందితుడిగా చేర్చాలంటూ సామాజిక ఉద్యమకర్త ప్రవీణ్ వాటెగాన్కర్ దాఖలు చేసిన పిటిషన్ ను బాంబే హైకోర్టు విచారణకు స్వీకరించింది. ఆదర్శ్ బిల్డింగ్ లో షిండే బినామీ పేర్లతో ఫ్లాట్లను పొందారని, దీనిపై సీబీఐ, ఈడీతో దర్యాప్తు చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలమేరకు బినామీలపై సీబీఐ దర్యాప్తు చేస్తోందని సీబీఐ న్యాయమూర్తి కోర్టుకు తెలిపారు. ఇందులో షిండే పాత్ర లేదని కూడా అన్నారు. దీంతో దర్యాప్తు పూర్తయిన తరువాత పిటిషన్ ను విచారిస్తామని హైకోర్టు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే నెల 26 కు వాయిదా వేసింది.

  • Loading...

More Telugu News