: కాంగ్రెస్‌లో టీఆర్ఎస్ విలీనం ఉండదు: ఈటెల
టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోమని ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్ పరోక్ష సంకేతాలిచ్చారు. టీఆర్ఎస్ ది భౌగోళిక తెలంగాణ అజెండా కాదని, తెలంగాణ పునర్నిర్మాణ అజెండా అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నడిపేది తామేనని... కేంద్రం పెత్తనాన్ని సహించబోమని స్పష్టం చేశారు. టీఆర్ఎస్ 13 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని టైమ్స్ నౌ-సీ ఓటర్ ఇచ్చిన రిపోర్టుతో టీఆర్ఎస్ బాధ్యత మరింత పెరిగిందని రాజేందర్ అన్నారు. రోజు రోజుకూ టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందనడానికి ఈ సర్వేలే నిదర్శనమని తెలిపారు.