: మంత్రి గీతారెడ్డికి కోర్టు సమన్లు
వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో మంత్రి గీతారెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. నవంబర్ 15న తమ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. జగన్ అక్రమాస్తుల కేసులో లేపాక్షి ఛార్జిషీటును విచారణకు స్వీకరించిన సీబీఐ కోర్టు విచారణకు స్వీకరించింది. అటు లేపాక్షి నాలెడ్జ్ భూముల వ్యవహారంలో అదేరోజు విచారణకు రావాలని జగన్, ధర్మానకు కోర్టు సమన్లు ఇచ్చింది. ఇదే వ్యవహారంలో విజయసాయి రెడ్డి, శ్యాంప్రసాద్ రెడ్డి, బాలాజీలకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది.