: మహిళల 5కే రన్
ప్రపంచ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని నెక్లెస్ రోడ్డులో ఈ రోజు 5కే మహిళారన్ జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు ఎక్కువగా పాల్గొన్నారు. హుషారుగా 5 కిలోమీటర్ల పాటు పరుగులు తీశారు. 5కే రన్ కార్యక్రమాన్ని పర్యాటక శాఖ కార్యదర్శి చందనాఖాన్, సినీనటి మంచు లక్ష్మి ప్రారంభించారు. ఈ సందరర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
ఏటా మార్చి 8న ప్రపంచ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటారు. దీనినే ఇంటర్నేషనల్ వర్కింగ్ ఉమెన్స్ డే అని కూడా పిలుస్తారు. మహిళలు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఉన్నత స్థితికి వెళ్లాలనే ఆశయాలతో ఆ రోజున పలు కార్యక్రమాలను ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలలో నిర్వహిస్తూ ఉంటారు.