: బొగ్గు స్కాంలో అధికారులను సీబీఐ వేధిస్తోంది: యనమల


బొగ్గు కుంభకోణంలో ప్రధాన నిందితులను రక్షించే క్రమంలో అధికారులను సీబీఐ వేధిస్తోందని తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మీడియాతో మాట్లాడుతూ... పరేఖ్ పై సీబీఐ అభియోగాలు ఈ కుట్రలో భాగమేనని విమర్శించారు. దీనికితోడు, జగన్ బెయిల్ వెనుక సోనియా, మన్మోహన్ హస్తం ఉందని అన్నారు. రాష్ట్ర విభజన విషయంలో ఇరు ప్రాంత ప్రజలతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయాలని ఢిల్లీలో కూర్చున్నవారు నిర్ణయం తీసుకోవడం అత్యంత దారుణమని యనమల అన్నారు. దీని వల్ల ఇరు ప్రాంతాల ప్రజలకూ నష్టం వాటిల్లుతుందని తెలిపారు.

  • Loading...

More Telugu News