: సీమాంధ్ర సమ్మెతో ఆర్టీసీకి భారీ నష్టం: ఎకే ఖాన్
రెండు నెలలకు పైగా సీమాంధ్రలో జరిగిన సమ్మెవల్ల ఆర్టీసీకి రూ.745 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఎండీ ఎకే ఖాన్ తెలిపారు. జేఎన్ఎన్ యూఆర్ఎం ఫేజ్-2 కింద రాష్ట్ర వ్యాప్తంగా పలు పట్టణాల్లో 730 సిటీ బస్సులు నడపనున్నట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 పట్టణాల్లో నూతన సిటీ బస్సులు ప్రవేశపెట్టాలని నిర్ణయించామన్నారు. హైదరాబాద్ లో 422, విశాఖ 105, విజయవాడ 90, తిరుపతి 120 సిటీ బస్సులు ప్రవేశపెడతామని.. గుంటూరు, కడప, ఖమ్మం, మహబూబ్ నగర్, ఖమ్మం, అనంతపురం, చిత్తూరులో 230 బస్సులు ప్రవేశపెడతామని చెప్పారు. జీపీఎస్ ఆధారంగా బస్సుల రాకపోకల సమయాన్ని కచ్చితంగా తెలియజేస్తామని వివరించారు.