: పురంధేశ్వరి సీమాంధ్రుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు: మోదుగుల
రాష్ట్ర విభజనపై కేంద్ర మంత్రి పురంధేశ్వరి చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాలరెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాజ్యసభ సీటుకు కక్కుర్తిపడి దగ్గుబాటి కుటుంబం సీమాంధ్రులను మోసం చేస్తోందని దుయ్యబట్టారు. సమైక్య రాష్ట్రం కోసం శీతాకాల సమావేశాల్లో పల్నాటి పౌరుషం చూపుతామని మోదుగుల తెలిపారు.