: అంబాజీపేటలో రైతు గర్జన
రాష్ట్ర విభజన వద్దంటూ కేంద్ర మంత్రులు రాజీనామా చేయాలని.. తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ వాణిజ్య కేంద్రమైన అంబాజీపేటలో ఈ రోజు అన్నదాతలు రైతు గర్జన నిర్వహించారు. ఎడ్లబళ్లతో ర్యాలీ నిర్వహించారు. కొబ్బరికాయలను నాలుగు రహదారుల కూడలిలో వేసి నిరసన తెలిపారు. కొబ్బరి దింపు కార్మికులు పనిముట్లతో ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ శ్రేణులు కూడా ర్యాలీ నిర్వహించాయి. వీరి నిరసనతో పెద్దఎత్తున ట్రాఫిక్ నిలిచిపోయింది.