: ఆశారాం బాపూకు లైంగిక సామర్థ్య పరీక్ష


అత్యాచారం కేసులో కటకటాల పాలైన ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపూకు అహ్మదాబాదులో ఈ రోజు లైంగిక సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేశాడన్న ఆరోపణలతో జైలు పాలైన ఆశారాంపై... సూరత్ కు చెందిన అక్కాచెల్లెళ్ళు కూడా ఫిర్యాదు చేశారు. ఆశారాం, అతని కుమారుడు నారాయణసాయి తమపై అత్యాచారం చేశారని వారు కేసు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ కేసుల నేపథ్యంలో, ఆశారాంకు లైంగిక పరమైన సామర్థ్యం ఉందా? లేదా? అన్న కోణంలో ఆయనకు పరీక్షలు నిర్వహించారు.

  • Loading...

More Telugu News