: రూ.12.25 కోట్ల విలువైన ఆభరణాలు చోరీ
జార్ఖండ్ రాజధాని రాంచీలో భారీ దోపిడీ జరిగింది. బంగారు ఆభరణాల షాపును దొంగలు కొల్లగొట్టారు. 12.25కోట్ల రూపాయల విలువైన బంగారు, వజ్రాభరణాలను ఎత్తుకెళ్లారు. ఈ దొంగతనం స్థానికంగా ఆభరణాల వర్తకులను షాక్ కు గురి చేసింది. విజయదశమి సందర్భంగా ఆది, సోమవారాల్లో స్థానిక ఆనంద్ జ్యూయెలర్స్ మూసి ఉంది. మంగళవారం యజమానులు వచ్చి చూసేసరికి షాపులోని ఆభరణాలన్నీ మాయమవ్వడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొంగలు గ్రిల్స్ ను కత్తిరించి లోపలకు ప్రవేశించి చోరీకి పాల్పడినట్లు గుర్తించారు.