: ఒబామా సంతకంతో అమెరికా అనిశ్చితికి తెర


అమెరికాలో రెండువారాలకు పైగా సాగిన ఆర్ధిక అనిశ్చితికి తెరపడింది. ప్రభుత్వ కార్యాలయాల షట్ డౌన్ కు ముగింపు పలుకుతూ అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా బిల్లుపై సంతకం చేశారు. బడ్జెట్ ఆమోదానికి డెమొక్రాట్లు, రిపబ్లికన్లు ఓ అంగీకారానికి రావడంతో సమస్య పరిష్కారమైంది. ఒబామా కేర్ పథకం అమలుకు ప్రవేశపెట్టిన బిల్లుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన రిపబ్లికన్ల తీరుకు నిరసనగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వ కార్యాలయాల షట్ డౌన్ కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో, రెండు వారాలపాటు ప్రభుత్వ కార్యాలయాలు తెరుచుకోలేదు. ఎట్టకేలకు షరతులతో రిపబ్లికన్లు అంగీకరించడంతో యూఎస్ ఉభయసభల్లో బిల్లు ఆమోదం పొందింది. దీనిని ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు జిమ్ యంగ్ కిమ్ స్వాగతించారు.

  • Loading...

More Telugu News