: చవకధరకే త్రీడీ ఎల్ఈడీ రేజర్ టీవీ


అత్యాధునిక టీవీలను తక్కువ ధరలకే అందించే ఏవోసీ మరో టీవీని వినియోగదారుల ముంగిటకు తీసుకొచ్చింది. 23 అంగుళాల పూర్తి హెచ్ డీ త్రీడీ ఎల్ఈడీ రేజర్ టీవీని విడుదల చేసింది. దీని ధర రూ.19,990. రిమోట్ లో ఒక్క బటన్ నొక్కడం ద్వారా టూడీ కంటెంట్ ను త్రీడీ ఎఫెక్ట్ తో చూసుకునే సౌలభ్యం ఉందని కంపెనీ తెలిపింది. డ్రీమ్ సరౌండ్ సౌండ్ సదుపాయం వల్ల శబ్ద నాణ్యత ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇక యూఎస్ బీ, హెచ్ డీఎంఐ, వీజీఏ సదుపాయాలూ ఉన్నాయి.

  • Loading...

More Telugu News