: ఒక్క అవకాశమివ్వండి.. మార్పేంటో చూపిస్తాం: మోడీ
'ఒకే ఒక్క చాన్స్.. నన్ను నేను నిరూపించుకుంటా' ఖడ్గం సినిమాలో సంగీత డైలాగ్ ఇది. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ కూడా ఈ డైలాగే కొట్టారు. బీజేపీకి కేంద్రంలో ఒక్క చాన్స్ ఇస్తే మార్పు ఏంటో చూపిస్తామని హామీ ఇచ్చారు. గాంధీ నగర్ లో పట్టణాభివృద్ధిపై సదస్సును ఈ రోజు ప్రారంభించిన సందర్భంగా మోడీ మాట్లాడారు. ఐదేళ్ల పాటు పాలించే అవకాశం బీజేపీకిస్తే.. మార్పును తీసుకొచ్చి చూపిస్తామని, ఆ మార్పును ప్రజలు అభినందించడంతోపాటు గుర్తుంచుకుంటారని వ్యాఖ్యానించారు.