: రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉండదు: కిల్లి కృపారాణి
విభజన నేపథ్యంలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి తనదైనశైలిలో విశ్లేషణ ఇచ్చుకున్నారు. ప్రజాప్రతినిధుల రాజీనామాలతో రాష్ట్రం సమైక్యంగా ఉంటుందని తాను భావించడంలేదన్నారు. ఒకవేళ రాజీనామాల వల్ల సమైక్యంగా ఉంటుందంటే తాను రాజీనామా చేస్తానని చెప్పారు. ఈ ఉదయం అధినేత్రి సోనియాగాంధీతో కృపారాణి సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడిన మంత్రి పైవిధంగా వ్యాఖ్యానించారు. అంతేగాక శ్రీకాకుళం జిల్లాలో ఫైలిన్ తుపాను నష్టాన్ని అధినేత్రికి వివరించానన్నారు. నష్టపోయిన రైతులు, మత్స్యకారులకు సహాయం చేయాలని కోరినట్లు తెలిపారు.