: శ్రీశైల మల్లన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
రాష్ట్రంలోని అతిపురాతన శైవ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాలు ఈ ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ నెల 13 వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. శ్రీశైల గిరులపై కొలువైన జ్యోతిర్లింగ దర్శనం కోసం భక్తుల తాకిడి మొదలైంది.
రాష్ట్రం నలుమూలల నుంచీ సుమారు పది లక్షల మంది భక్తులు ఈ బ్రహ్మోత్సవాలకు విచ్చేస్తారని భావిస్తున్నారు. అయితే, దేవస్థానం మాత్రం భక్తులకు సరైన సదుపాయాలు కల్పించడంలో ఉదాసీనత ప్రదర్శిస్తోంది. వసతుల కల్పనలో ప్రణాళికా లోపం కనిపిస్తోంది.