: దేశంలోనే రెండో అతిపెద్ద విపత్తు ఫైలిన్ : మర్రి శశిధర్ రెడ్డి
మన దేశంలో ఇప్పటిదాకా సంభవించిన విపత్తుల్లో రెండో అతిపెద్ద విపత్తు ఫైలిన్ అని ఎన్ ఎండీఏ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి తెలిపారు. ఫైలిన్ దెబ్బకు ఒడిశాలో 23 మంది, ఆంధ్రప్రదేశ్ లో ఇద్దరు చనిపోయారని అన్నారు. తుపాను నష్టాన్ని కేంద్రం ద్వారా ఇప్పించేందుకు తన వంతు సహకారం అందిస్తానని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రాష్ట్రాలు అంచనాలు పంపుతుండటం వల్లే... రాష్ట్రాలు అడుగుతున్నంతగా నిధులు రావడంలేదని తెలిపారు. ఇప్పటికైనా మన రాష్ట్రం వీలైనంత త్వరగా విపత్తు నిర్వహణ దళాన్ని ఏర్పాటు చేసుకోవాలని శశిధర్ రెడ్డి సూచించారు.