: నేడు ఏపీఎన్జీవో నేతల భేటీ
ఈ రోజు ఉదయం ఏపీఎన్జీవో నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశంలో చర్చించే అంశాలతో సమ్మె కొనసాగింపుపై ఒక నిర్ణయానికి రానున్నారు. అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు వీరు సీఎంతో భేటీ కాబోతున్నారు. ఉద్యోగుల భద్రత విషయంలో సీఎం హామీని పొందడానికి వీరు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యమంత్రి ఇచ్చే హామీని బట్టి భవిష్యత్ కార్యాచరణను రూపొందించుకునేందుకు ఉద్యోగ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.