: రేపు గవర్నర్ ను కలవనున్న జగన్
వైఎస్సార్సీపీ అధినేత జగన్ రేపు గవర్నర్ నరసింహన్ ను కలవనున్నారు. అసెంబ్లీని సమావేశపరచాలని ఆయన గవర్నర్ ను కోరనున్నారు. శాసనసభలో సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టి, ఆమోదించి, దాన్ని కేంద్రానికి పంపాలని గవర్నర్ కు ఓ వినతిపత్రం సమర్పిస్తారు. జగన్ తో పాటు మేకపాటి రాజమోహన్ రెడ్డి, అందుబాటులో ఉన్న ఇతర నేతలు కూడా రాజ్ భవన్ కు వెళ్ళనున్నారు. సెప్టెంబర్ 30న కూడా జగన్ గవర్నర్ ను కలిసిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా జగన్ సమైక్యాంధ్ర తీర్మానం ప్రవేశపెట్టాలనే ప్రధానంగా కోరారు.