: చంద్రబాబుకు కట్టుకోండి సమాధి: పొన్నం
విభజన నిర్ణయం తీసుకుందంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి తిరుపతిలో సమైక్యవాదులు సమాధి కట్టడంపై ఎంపీ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. సోనియాకు సమాధి కట్టడమనేది టీడీపీ నేతల సంస్కార హీనతకు నిదర్శనమని విమర్శించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ శ్రేణులు వారి అధినేత చంద్రబాబుకు సమాధి కట్టుకుంటే బాగుంటుందని అన్నారు. సోనియాకు సమాధిపై సీఎం కిరణ్ స్పందించకపోవడం ఆయన అసమర్థతకు అద్దంపడుతోందని వ్యాఖ్యానించారు. కాగా, సోనియాకు సమాధిపై తిరుపతిలో కాంగ్రెస్ కార్యకర్తలు దీటుగా స్పందించారు. బాబు దిష్టిబొమ్మకు అంత్యక్రియలు నిర్వహించారు.