: రేపు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న రాహుల్
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ రేపు మధ్యప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. రెండు ర్యాలీల్లో ఆయన పాల్గొంటారని పార్టీ వర్గాలు తెలిపాయి. తొలుత షాదోల్ లోనూ, అనంతరం గ్వాలియర్ లోనూ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వచ్చే నెలలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.