: ఇష్టానుసారం నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారు: శైలజానాథ్


కేంద్రంపై రాష్ట్ర మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంపై ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, విభజన అనివార్యమంటున్న కేంద్ర మంత్రులు ఆ విషయాన్ని ప్రజల్లోకి వెళ్ళి చెప్పాలని సవాల్ విసిరారు. విభజన జరిగితే భవిష్యత్ లో కాంగ్రెస్ పార్టీ చాలా ప్రశ్నలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్య కార్యాచరణను రేపటి సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల సమావేశంలో ఖరారు చేస్తామని తెలిపారు.

  • Loading...

More Telugu News