: విభజన తీర్మానాన్ని ఓడించండి: ఏపీఎన్జీవో హైదరాబాద్ విభాగం


రాష్ట్ర విభజన తీర్మానం అసెంబ్లీకి వస్తే వ్యతిరేకించాలని హైదరాబాద్ విభాగం ఎపీఎన్జీవో నేతలు వారి అధ్యక్షుడు సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి విజ్ఞప్తి చేశారు. ఈ రోజు ఉదయం వారు సుధీర్ రెడ్డి నివాసానికి వెళ్లి వినతిపత్రం సమర్పించారు. రాష్ట్ర విభజనను అడ్డుకోవాలని కోరారు. రాష్ట్ర విభజన అంశం చాలా సున్నితమైనదని, ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని సుధీర్ రెడ్డి స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News