: న్యాయమే గెలిచింది: మైసూరారెడ్డి


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు వైఎస్సార్సీపీ హైదరాబాదులో నిర్వహించ తలపెట్టిన సమైక్య శంఖారావం సభకు హైకోర్టు అనుమతివ్వడం పట్ల ఆ పార్టీ నేత మైసూరారెడ్డి హర్షం వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, సభకు అనుమతి ఇవ్వడం ద్వారా న్యాయస్థానంలో న్యాయం గెలిచిందన్నారు. న్యాయం ఇంకా బ్రతికి ఉందనడానికి హైకోర్టు తీర్పే సాక్ష్యమని ఆయన పేర్కొన్నారు. తమ సభ ఎవరికీ వ్యతిరేకం కాదని, దేశం, రాష్ట్రం సమైక్యంగా ఉంటే అభివృద్ధి సాధ్యమని చెప్పడమే తమ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు. రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛను ప్రభుత్వం కాలరాయాలనుకోవడం దురదృష్టకరమని మైసూరా అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News