: తిరుపతి ఘటనపై చర్య తీసుకోవాలి: మంత్రి దానం


సోనియాగాంధీకి తిరుపతిలో సమాధి కట్టి అవమానపరచడాన్ని నిరసిస్తూ మంత్రి దానం నాగేందర్ ఆధ్వర్యంలోని గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ కమిటీ నిరసన చేపట్టింది. నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ చిత్ర పటం వద్ద సోనియా చిత్రపటం ఉంచి గుమ్మడికాయతో దిష్టి తీశారు. అనంతరం సమీపంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో పూజలు చేశారు. ఘటనకు కారకులైనవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని మంత్రి దానం నాగేందర్ డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News