: మళ్ళీ టాస్ ఓడిన ధోనీ
టీమిండియా కెప్టెన్ ధోనీ రెండో వన్డేలోనూ టాస్ కోల్పోయాడు. ఏడు వన్డేల సిరీస్ లో భాగంగా రెండో వన్డే జైపూర్లో జరుగుతోంది. ఈ డే-నైట్ మ్యాచ్ లో ఆసీస్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, భారత్, ఆసీస్ తొలి వన్డే ఆడిన జట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. ఇక టాస్ గెలిచిన ఆసీస్ సారథి జార్జ్ బెయిలీ మాట్లాడుతూ, విజయపరంపర కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశాడు. టీమిండియా సారథి ధోనీ స్పందిస్తూ, తాము టాస్ గెలిచినా తొలుత ఫీల్డింగ్ చేయడానికే మొగ్గు చూపేవారమని స్పష్టం చేశాడు. భారత్ తొలి వన్డేలోనూ టాస్ ఓడిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ధోనీ సేన 72 పరుగులతో పరాజయంపాలైంది. ఈ నేపథ్యంలో నేటి మ్యాచ్ లోనూ టాస్ ప్రభావం చూపే అవకాశం ఉంది.