: సీమాంధ్ర అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి: శ్రీనివాస్ గౌడ్
కేంద్ర మంత్రుల బృందం ఈ నెల 19న సమావేశమవుతుందని... ఈలోగా వారికి రాష్ట్రానికి సంబంధించిన సమాచారాన్ని పంపించాలని తెలంగాణ జేఏసీ కో చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. సమాచారాన్ని పంపించే విషయంలో సీమాంధ్ర అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని కోరారు. తప్పుడు సమాచారం ఇచ్చినా.. లేక గడువులోగా సమాచారాన్ని ఇవ్వలేకపోయినా... సదరు అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గతంలో ఆస్తులు, అప్పుల వివరాలపై తప్పుడు సమాచారమిచ్చి కేంద్రాన్ని తప్పుదోవ పట్టించారని దుయ్యబట్టారు. మహబూబ్ నగర్ లో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.