: యూపీలో సోనియా, ప్రియాంక గాంధీల హోర్డింగ్ కలకలం


ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి సంబంధించి ఆ పార్టీ నేతలు ఉత్తరప్రదేశ్ లో ఏర్పాటు చేసిన హోర్డింగ్ ఆ పార్టీలోనూ, జాతీయస్థాయిలోనూ కలకలం రేపుతోంది. సోనియాగాంధీ, ఆమె కుమార్తె ప్రియాంకాగాంధీ చిత్రాలను ముద్రించిన హోర్డింగ్ లపై 'తల్లి అనారోగ్యంతో ఉన్నారు, అన్న తలకు మించిన భారం మోస్తున్నారు, ప్రియాంక ఫుల్పూర్ నియోజవర్గం నుంచి బరిలో దిగుతున్నారు' అంటూ రాశారు. ఫుల్పూర్ నియోజకవర్గానికి గతంలో జవహర్ లాల్ నెహ్రూ ప్రాతినిధ్యం వహించారు. ఈ హోర్డింగ్ వ్యవహారంపై వెంటనే స్పందించిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సంబంధిత నాయకులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. పార్టీ నేతలను ఇద్దరిని బాధ్యులుగా పేర్కొంటూ.. సోనియాపై దుష్ప్రచారం చేయడం, ప్రియాంకను అనవసరంగా రాజకీయాల్లోకి లాగడం పట్ల పార్టీ వారిపై చర్యలు తీసుకుంటుందని సీనియర్ నాయకుడు చెప్పారు.

  • Loading...

More Telugu News