: మంగళగిరిలో సమైక్యాంధ్ర సింహా గర్జన
తొమ్మిదేళ్ల పాటు వేర్పాటు వాదులు అరాచకం సృష్టించి తెలంగాణపై ప్రకటన తెచ్చుకుంటే.. పదిహేను రోజుల్లోనే సమైక్యాంధ్ర నేతలు సత్తా చూపారని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో సమైక్యాంధ్ర సింహగర్జన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సదస్సుకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, నరహరిశెట్టి, శ్రీహరి, లక్ష్మీపార్వతిలతో పాటు పలువురు విద్యార్థి జేఏసీ నేతలు పాల్గొన్నారు.