: పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నిరసన: మంద కృష్ణ
ఎమ్మెల్యే శంకర్ రావు విషయంలో పోలీసుల తీరును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మూడు రోజుల పాటు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మంద కృష్ణ చెప్పారు. శంకర్ రావు దళితుడు అయినందునే ఆయన పట్ల పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించారని ఆరోపించారు.
శంకర్ రావు పట్ల అనుచితంగా వ్యవహరించిన పోలీసులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసారు. పోలీసులు తమ తీరు మార్చుకోకుంటే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని హెచ్చరించారు. కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శంకర్ రావు ను మంద కృష్ణ ఈ రోజు పరామర్శించారు.