: పశ్చిమ గోదావరి జిల్లాలో రైస్ మిల్లర్ హత్య
పశ్చిమ గోదావరి జిల్లా బుట్టాయిగూడెం మండలం రెడ్డిగణపవరంలో రైస్ మిల్లర్ లక్ష్మీపతిని కిడ్నాప్ చేసి ఆపై హత్య చేశారు. కిడ్నాప్ కు గురైన లక్ష్మీపతి మృతదేహాన్ని కామవరం దగ్గరున్న కాలువలో గుర్తించారు. పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.