: దూరదర్శన్ లో మహిళల శీలానికి రక్షణ లేదా?


దూరదర్శన్ లో మహిళలకు రక్షణ లేదా? అన్న ప్రశ్న మరోసారి ఉదయించింది. ప్రసార భారతి ఉన్నతాధికారి నుంచి తామూ లైంగిక వేధింపులు ఎదుర్కొన్నామంటూ మరో ముగ్గురు మహిళలు ధైర్యం చేసి ముందుకు వచ్చారు. కామం పేరుతో కాల్చుకు తింటున్న సదరు అధికారిపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

దూరదర్శన్ కు చెందిన ఒక మహిళా ఉద్యోగిపై అడిషనల్ డైరెక్టర్ లైంగిక వేధింపులు గతంలో బయటకు రావడంతో.. జాతీయ మహిళా కమిషన్ ఇప్పటికే దర్యాప్తు చేస్తోంది. సదరు అధికారి వేధింపులకు సంబంధించి ప్రాథమిక సాక్ష్యాధారాలు ఉన్నట్లు దర్యాప్తులో తేలడంతో అతడిపై సస్సెన్షన్ వేటు వేశారు. ఈలోపే మరో ముగ్గురు తామూ బాధితులమేనంటూ మహిళా కమిషన్ కు తెలిపారు.

లోగడ ఫిర్యాదు చేయాలంటే భయపడ్డామని, తమ సంస్థలో ఫిర్యాదుల పరిష్కార విభాగం ఉన్నదో, లేదో తమకు తెలియదని వారు జాతీయ మహిళా కమిషన్ తో చెప్పారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మహిళా ఉద్యోగులపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక సెల్ ప్రసార భారతిలో లేకపోవడాన్ని కమిషన్ తప్పుబట్టింది. ఉద్యోగినుల రక్షణ విషయంలో ప్రసార భారతి వైపు నుంచి వైఫల్యాలను ఎత్తి చూపింది.

  • Loading...

More Telugu News