: ఐఫోన్ 5ఎస్, 5సీ ధరలను ప్రకటించిన ఆపిల్
ప్రపంచ ప్రఖ్యాత స్మార్ట్ ఫోన్ తయారీదారైన ఆపిల్... ఇండియన్ మార్కెట్లో తన లేటెస్ట్ వెర్షన్ 5ఎస్, 5సీ ఫోన్ల ధరలను ప్రకటించింది. 5ఎస్ కు సంబంధించి 64జీబీ మోడల్ ధర రూ. 71,500, 32జీబీ ధర రూ. 62,500, 16జీబీ ధర రూ. 53,500గానూ.. అలాగే, 5సీకి సంబంధించి 32జీబీ మోడల్ ధర రూ. 53,500, 16 జీబీ ధర రూ. 41,900గా నిర్ణయించింది.
ఐఫోన్ 5ఎస్ గోల్డ్, సిల్వర్, స్పేస్ గ్రే (బ్లాక్ షేడ్) రంగుల్లో లభ్యమవుతుంది. అలాగే 5సీ నీలం, ఆకుపచ్చ, గులాబీ, పసుపు, తెలుపు రంగుల్లో లభ్యమవుతుంది. ఈ రెండు మోడల్స్ భారత మార్కెట్లో నవంబర్ 1 నుంచి అందుబాటులో ఉంటాయి.