: సమైక్య ఉద్యమం కొనసాగాలి: ముద్దుకృష్ణమ
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సీమాంధ్ర ప్రజలు, ఉద్యోగులు కొనసాగించాలని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు కోరారు. రాష్ట్రం అగ్నిగుండంగా మారడానికి సోనియాగాంధీ, బొత్స సత్యనారాయణలే కారణమని ఆయన విమర్శించారు. విజయనగరంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర విభజనకు పునాది వేసింది వైఎస్ రాజశేఖరరెడ్డేనని ఆయన చెప్పుకొచ్చారు.