: ఇంటర్నెట్ పై నియంత్రణలకు వ్యతిరేకం: సిబల్
భద్రత పేరుతో ఇంటర్నెట్ పై ఎలాంటి నియంత్రణలు విధించడానికైనా భారత్ వ్యతిరేకమని టెలికాం శాఖ మంత్రి కపిల్ సిబల్ చెప్పారు. ఇంటర్నెట్ పై నియంత్రణల విషయంలో భారత్ భాగస్వామి కాబోదన్నారు. ప్రైవేటు రంగ నియంత్రణకు అనుమతించాలన్న దానికీ తాము వ్యతిరేకమని, ప్రైవేటు రంగం చేతిలో పెడితే జవాబుదారీ ఉండదని చెప్పారు.