: మసాజ్ సెంటర్ పేరుతో వ్యభిచారం!
బయట బోర్డు చూస్తే మసాజ్ సెంటర్, ఫిట్ నెస్ సెంటర్ అనే ఉంటాయి. లోపలకు వెళితే ఇంకేదో కనిపించవచ్చు. అసలు సేవలకు కొసరు ఆఫర్ చేయవచ్చు. హైదరాబాద్ లోని ఉప్పల్ లో మసాజ్ సెంటర్ లో వ్యభిచారం జరుగుతోందన్న సమాచారం ఆధారంగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆ కేంద్రంపై దాడి చేసి ముగ్గురు మహిళలు సహా ఐదుగురిని ఈ ఉదయం అరెస్ట్ చేశారు.