: జీవనాశక పదార్ధాలతో క్యాన్సర్‌ వ్యాధికి చికిత్స


క్యాన్సర్‌ వ్యాధిని సమూలంగా నివారించేందుకు సరైన ఔషధాన్ని తయారుచేయడానికి శాస్త్రవేత్తలు ఎంతగానో కృషి చేస్తున్నారు. ఈ నేపధ్యంలో క్యాన్సర్‌ వ్యాధికారక కణాలను నాశనం చేసేందుకు జీవనాశక పదార్ధాలతో తయారుచేసిన కృత్రిమ కణాలను ఉపయోగించే సరికొత్త విధానాన్ని వైద్యులు రూపొందించారు. క్యాన్సర్‌ కణాలను నాశనం చేసేలా రోగనిరోధక శక్తిని చైతన్యవంతం చేయడానికి ఈ కృత్రిమ కణాలు ఉపకరిస్తాయి. ఫలితంగా క్యాన్సర్‌ కారక కణాలు నాశనం అవుతాయి.

జాన్స్‌ హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన శాస్త్రవేత్తలు క్యాన్సర్‌ వ్యాధి కారక కణాలను నాశనం చేసేలా రోగనిరోధక శక్తిని చైతన్యవంతం చేసేందుకు ఉపకరించే కృత్రిమ కణాలను అభివృద్ధి చేశారు. యాంటిజెన్‌-ప్రెజెంటింగ్‌ కణాలు(ఏపీసీ), టి-కణాల మధ్య పరస్పర చర్యాక్రమం ఆధారంగా శాస్త్రవేత్తలు ఈ కృత్రిమ కణాలను అభివృద్ధిపరచారు. దీర్ఘచతురస్రాకారంలో చదునుగా ఉండే ఈ కృత్రిమ కణాలను రోగి శరీరంలోకి నేరుగా ప్రవేశపెట్టవచ్చు. ఈ కణాలను గురించి జాన్స్‌ హాప్‌కిన్స్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ జోర్డాన్‌ గ్రీన్‌ మాట్లాడుతూ జీవనాశక పదార్ధాలతో దీర్ఘచతురస్రాకార కృత్రిమ ఏపీసీలను తయారుచేసినట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News