: భారత పర్యటనకు రానున్న ప్రిన్స్ చార్లెస్


బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ చార్లెస్, ఆయన సతీమణి కెమిల్లా పార్కర్ నవంబర్ లో భారత పర్యటనకు రానున్నారు. వారు తమ పర్యటనలో భాగంగా డెహ్రాడూన్, ఢిల్లీ, ముంబయి, పుణె, కొచ్చి తదితర ప్రాంతాల్లో పర్యటిస్తారని బ్రిటన్ లోని ప్రిన్స్ చార్లెస్ కార్యాలయ వర్గాలు తెలిపాయి. వీరి పర్యటన నవంబర్ 6 నుంచి 14 వరకు తొమ్మిది రోజుల పాటు జరగనుంది. అనంతరం ప్రిన్స్ చార్లెస్ చోగమ్ సదస్సుకు హాజరయ్యేందుకు శ్రీలంక పయనమవుతారు.

  • Loading...

More Telugu News