: బక్రీద్ సందర్భంగా హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు


బక్రీద్ పండగ సందర్భంగా రేపు హైదరాబాదులో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమిషనర్ అనురాగ్ శర్మ తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుంచి 11.30 వరకు నగరంలోని మూడు ప్రధాన ఈద్గాల పరిధిలో వాహనాల రాకపోకలపై నియంత్రణ విధించారు. మీర్ఆలం, బాలంరాయి, సికింద్రాబాద్ ఈద్గాల పరిసరాల్లో ప్రార్ధన సమయంలో సాధారణ వాహనాల రాకపోకలను అనుమతించరు. వాటిని దారి మళ్లిస్తారని, వాహనదారులు గమనించి పోలీసుల సూచనల మేరకు నడచుకోవాలని అధికారులు నగరవాసులకు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News