: పాకిస్థాన్ కు న్యూక్లియర్ రియాక్టర్లను విక్రయించనున్న చైనా


చైనా దేశీయంగా తయారుచేసిన రెండు న్యూక్లియర్ రియాక్టర్లను పాకిస్థాన్ కు విక్రయించనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగిపోయాయి. ఈ వ్యవహారంపై భారత్ తీవ్ర అసహనాన్ని వ్యక్తపరచింది. పాక్ లాంటి దేశాలకు న్యూక్లియర్ రియాక్టర్లను అందజేస్తే... అది తమ దేశ రక్షణకు ముప్పుగా పరిణమిస్తుందని దుయ్యబట్టింది. పాకిస్థాన్ లో ఏ కార్యక్రమాన్ని కూడా అక్కడి మిలిటరీ నుంచి విడదీయలేమని విమర్శించింది. తన నిరసనను భారత్ అధికారికంగా, రాజకీయంగా రెండు విధాలా చైనాకు వ్యక్తపరిచింది. అంతే కాకుండా, అణ్వస్త్ర వ్యాప్తి నిరోధక సంస్థకు కూడా ఫిర్యాదు చేసింది.

  • Loading...

More Telugu News