: బాలికపై అత్యాచారం చేసిన ఏఎస్సై
కంచే చేనుమేసింది. అధికార మదంతో ఓ ఏఎస్సై.. బాలికపై అత్యాచారం చేశాడు. దక్షిణ త్రిపురలోని గోమతి జిల్లాలోని పిత్రా పట్టణంలో ఏఎస్సైగా పని చేస్తున్న మంగళ్ దేవ్ వర్మ 11వ తరగతి చదువుతున్న బాలికను మభ్యపెట్టి ఇటుకబట్టీల వద్దకు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. బాలిక అరుపులు విన్న స్థానికులు ఆమెను రక్షించడంతో ఏఎస్సై అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో, అతనిని విధుల నుంచి తప్పించి, అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. అతనిని రక్షించేందుకు బాలిక నుంచి ఫిర్యాదు తీసుకోకుండా తాత్సారం చేసిన రాధాకిషోరపురం పోలీసులపై దర్యాప్తుకు ఆదేశించినట్టు జిల్లా ఎస్పీ జ్ఞాన తిరుసంబంధన్ తెలిపారు. బాధితురాలి పక్షాన నిలిచిన మహిళా పోలీసుస్టేషన్ అధికారులను ఆయన అభినందించారు.